మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Mattapalli Narasimha Mangalashtakam – శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం
మట్టపల్లినివాసాయ మధురానందరూపిణే |
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 1 ||
కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయినే |
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 2 ||
కర్తస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మనే |
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 3 ||
ఋగ్యజుః సామరూపాయ మంత్రారూఢాయ ధీమతే |
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 4 ||
గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే |
గుహరాంతే విహారాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 5 ||
శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మధురాయ చ |
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 6 ||
తాపనీయరహస్యాయ తాపత్రయవినాశినే |
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 7 ||
రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || 8 ||
ముక్కూర్ నృసింహదాసేన ప్రోక్తం మంగళమద్భుతమ్ |
యః పఠేచ్ఛ్రద్ధయా భక్త్యా సర్వపాపైర్విముచ్యతే || 9 ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.